రాజీవలోచ న రాజసుల ోచన :My article in Harivillu, ManaTelangana 11-6-17

My article in Harivillu, ManaTelangana 11-6-17.

రాజీవలోచన రాజసులోచన
నాట్యకారిణిగా మద్రాసులో 1952 లో అరంగేట్రం ఇచ్చి, ఆ అరంగే ట్రం చూసిన నటుడు నిర్మా త గుబ్బి వీరన్న దృష్టిలో పడి కన్నడ చిత్రం గుణసాగరి చిత్రంలో నటిగా పరిచమయ్యారు రాజసులోచన. కథానాయికగా రాణించి, వ్యాంప్ పాత్రల్లోనూ విరాజిల్లి, కేరక్టర్ ఆర్టిస్టుగాను ప్రతిభ చూపి పంచభాషా చిత్రాల నటిగా 234 చిత్రాలకు పైనే నటించారు. పుష్పాంజలి నృత్యకళాకేంద్రాన్ని 1961లో స్థాపించి అనేకమందికి క్లాసికల్ నృత్యాలలో శిక్షణ ఇవ్వటమే కాక తను, తన శిష్యరాళ్లతో దేశ విదేశాల్లో పలు నాట్య ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు.
రైల్వేశాఖలో ఉద్యోగం చేసిన పిళ్లారశెట్టి భక్తవత్సలం నాయుడు దంపతులకు 1935 ఆగస్టు 16న విజయవా డలో జన్మించారు. రాజీవలోచన అనే పెట్టారు. చిన్నతనం నుంచే నాట్యం మీద మక్కువ ఏర్పరచుకుని నాట్యం నేర్చుకోవాలనే కోరిక వ్యక్తం చేసేవారు. కొన్ని కట్టుబాట్ల కారణంగా నాట్యం నేర్పించక సంగీతంలో శిక్షణ ఇప్పించేవారు తండ్రి. ఆమె తొమ్మిదవ ఏట తండ్రికి రైల్వే జనర ల్ మేనేజర్‌కి పి.ఎ.గా మద్రాసుకి బదిలీ అయింది. మద్రా సులోని ట్రిప్లికేన్‌లో మకాం పెట్టారు. ఆ సమయంలోనే పద్మిని, లలిత చేసే నాట్యాలను చూసి, వారిలా నాట్యం చేయాలనే కోరిక పెంచుకుని సంగీతంతో బాటు నాట్యం కూడా నేర్పించుమని గోలగోల చేసేవారు. తరచు మారాం చేసే రాజీవలోచనని భరించలేక సరస్వతి గాన నిలయం నిర్వహించే లలితమ్మ వద్ద భరత నాట్య తరగతుల్లో జేర్పిం చారు. ట్రిప్లికేన్ స్కూల్లో చేర్పించేటప్పుడు రాజీవలోచన పేరుని సరిగా వినక రాజసులోచనగా నమోదు చేశారు. ఏ క్షణాన ఆ పేరు అలా నమోదు అయిందోగాని నాట్యకారిణిగా, నటిగా, నృత్య కళాశాల నిర్వహకురాలిగా రాజసులోచన పేరుతోనే సుప్రసిద్ధురాలయ్యారు. కె.ఎస్.దండా యుధపాణి వద్ద కూడా భరత నాట్యంలో శిక్షణ పొం దారు ఆచార్యులు వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యాన్ని కృష్ణకుమార్, వ్యాసార్కర్ పభృతుల వద్ద కథక్ నృత్యాన్ని, కళామండలం మాధవన్ వద్ద కథాకళి అభ్యసించారు.
ప్రముఖ జడ్జి, సంగీతాభిమాని అయిన టి.ఎల్. వెంకట్రామ అయ్యర్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాజసులోచన అరంగేట్రం ఇచ్చి మెప్పించారు. ఆ ప్రదర్శనను తిలకించిన ప్రముఖ నటుడు, నిర్మాత గుబ్బి వీరన్న తాము నిర్మించిన గుణసాగరి కన్నడ చిత్రంలో నాట్య ప్రధానమైన పాత్రకు ఎంపిక చేశారు. గుబ్బి వీరన్న, పండరీబాయి, హానప్ప భాగవతార్ ముఖ్యపాత్రలు పోషించ గా, హెచ్.ఎల్.ఎన్. సింహా దర్శకత్వంలో ఎ.వి.మొయ్యప్పన్, గుబ్బి వీరన్న, సి.ఆర్.బసవరాజు గుణసాగరి చిత్రాన్ని నిర్మించి 1953 జనవరి 15న విడుదల చేశారు. ఆ చిత్రం విడుదలై విజయం సాధించి, రాజసులోచనకు పేరు తెచ్చింది. ఈ చిత్రాన్ని సత్యశోధనై పేరుతో తమిళంలో విడుదల చేస్తే తమిళ ప్రేక్షకులనూ అలరించింది.
కె.ఎస్. ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో జి.వరలక్ష్మి, ఆర్.నాగేశ్వరరావు భార్యాభర్తలుగా, అక్కినేని నాగేశ్వరరావు నంబియార్ వారి కుమారులుగా కన్నతల్లి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఈ చిత్రం ద్వారా గాయనిగా పి.సుశీలను, నటిగా రాజసులోచనను పరిచయం చేశారు. ఈ చిత్రం 1953 ఏప్రిల్ 16న విడుదలైంది కె.సోము దర్శకత్వంలో. ఎం.ఎ.వేణు, తమిళంలో పెన్నరసి చిత్రాన్ని నిర్మించగా కన్నాంబ మహారాణిగా పెన్నరసి టైటిల్ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో రాజ నర్తకిగా రాజసులోచన పరిచయం అయింది. 1955 ఏప్రి ల్ 7న విడుదలై రాజసులోచనకు నర్తకిగా పేరు తీసు కొచ్చింది.
కొన్ని సినిమాల్లో ఒక మాదిరి పాత్రలు పోషించాక ఘంటసాల నిర్మించిన సొంతవూరు చిత్రంలో ఎన్.టి.రామారావు సరసన నాయికగా నటించింది. ఇది 1956లో విడుదలైంది. అప్పటినుంచి కథానాయికగా కొనసాగింది రాజసులోచన.
రాజసులోచన ఒకసారి మాటల సందర్భంలో “నాకు డ్యాన్సు నేర్చుకోవడం అంటే ఇష్టం. అది నేర్పించమంటే కుదరదు అని సంగీతం నేర్పించేవారు. ఏడుపొచ్చేసేది. చెన్నపట్టణంకి నాన్నగారి బదిలీ కారణంగా మకాం మారి పోవడంతో నా అదృష్టం తిరిగింది. ట్రిప్లికేన్‌లో మేముండే ఇంటికి వెళ్లేదారిలో లలితమ్మ గారి నృత్య పాఠశాల వుండేది. దాంతో గొడవ చేసి, గోల చేసి, ఏడిచేసి నాన్నగారిని ఒప్పించి ఆ స్కూల్లో చేరాను. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు వుంటాయేమో, ఏ డ్యాన్సు చూసినా ఆ డ్యాన్సు నేర్చుకోవాలని ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదల నాకు ఎక్కువగా వుండేది. అది నేర్చుకునే వరకు మనసు ఆగేది కాదు. నేర్చుకునేటప్పుడే అయిదారేళ్ల వయసు గల అమ్మాయిలకు స్కూల్లో నేను డ్యాన్సులు నేర్పేసేదాన్ని. ఇంటి దగ్గర కూడా కొందరికి నేర్పేదాన్ని” అని చెప్పింది.
“వెంపటి చిన సత్యం గారు నృత్యం మీద నాకు ఉన్న ఆసక్తి గమనించి చాలా మెచ్చుకునేవారు. నన్ను పరిణతి గల డ్యాన్సర్‌గా తీర్చిదిద్దడంలో ఆయన చాలా కష్టపడేవారు. జావళి నృత్యం కూడా ఆయన ద్వారానే నేర్చుకున్నాను. భావాలు ఎలా పలకాలో పలికించాలో నేర్పింది పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చిన సత్యం, జగన్నాథ శర్మ, ఇంకా చాలా మంది నాట్యంలో నాకు మెళకువలు నేర్పించారు. ముద్రలు, అభినయం చక్కగా చూపే వరకూ గురువుగాని, డ్యాన్స్ డైరెక్టర్లుగాని ఆరోజుల్లో మమ్మల్ని వదిలేవాళ్లు కాదు. వారు అంత స్ట్రిక్ట్‌గా వుండబట్టే వారి కళ మాకు అబ్బింది” అని చెప్పారామె.
“నాట్యకళకు నా వంతు సేవ చేయాలనే పుష్పాంజలి నృత్య కళాక్షేత్రం 1961లో ఏర్పాటు చేశాను. 1986లో రజతోతవ వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ కళా క్షేత్ర ద్వారా నేను, మా శిష్యురాళ్లు దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాము. భామాకలాపం, అర్ధనారీశ్వర నాట్యం, శ్రీనివాస కళ్యాణం, అష్టలక్ష్మీ వైభవం వంటి మా నృత్య ప్రదర్శనలకు ఎంతో పేరొచ్చింది. అమెరికా, రష్యా, చైనా, జపాన్, సిలోన్, సింగపూర్ ఇలా చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చాము” అని ఎంతో సంబరంగా చెప్పేవారు రాజసులోచన.
రాజమకుటం, పెంకి పెళ్లాం, సారంగధర, టైగర్ రాముడు, వాల్మీకి, బభ్రువాహన తదితర చిత్రాల్లో ఎన్.టి.ఆర్.కి కథానాయికగా, ఇద్దరు మిత్రులు, శభాష్ రాజా, శాంతి నివాసం చిత్రాలలో అక్కినేనికి నాయికగా, చిట్టి తమ్ముడు, ఖైదీ అన్నయ్య, ప్రచండ భైరవి చిత్రాలలో కాంతారావు సరసన, రుష్యశృంగలో హరనాథ్‌కు, గ్రామదేవతలులో జగ్గయ్యకు జంటగా ఇలా పలువురు హీరోలతో నటించింది.
తమిళంలో ఎం.జి.ఆర్, శివాజీగణేశన్, ఎస్.ఎస్.రాజేందర్, కన్నడంలో రాజకుమార్, ఉదయకుమార్, మలయాళంలో ప్రేమ్ నజీర్ తదితర హీరోలతో కథానాయికగా తన హావభావాలతో, రూప లావణ్యాలతో, వాలు చూపులతో, కొంటె చూపులతో, శ్రుతి మించని ప్రణయాన్ని చిలికిస్తూ పాత్రోచిత నటనతో మెప్పించారు. విశాలమైన కలువ రేకుల వంటి కళ్ళు, చక్కని ముక్కు, విల్లు తరహా పెదవులు, చక్కని పలు వరసతో కూడిన ఆహ్లాదపరిచే నవ్వుతో బొద్దుదనమైనా తీరైన ఒంపు సొంపులతో ఆకట్టుకునేవారు.
వ్యాంప్ పాత్రలలో, కేరక్టర్ రోల్స్‌లోను తన ప్రత్యేక శైలీ విన్యాసాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. శాంతి నివాసం చిత్రంలో అక్కినేనితో కలిసి రావె రాధా రాణీ రావే రాధ నీవె కృష్ణుడు నేనే…, కం కం కంగారు నీ కేలనే నా వంక రావేలనే చెలి నీకింక సిగ్గేలనే నో నో నో నీ జోరు తగ్గాలిగా ఆరోజు రావాలిగా…, అక్కినేనిని తలుస్తూ కలనైనా నీవలపే…. పాటల్లో, ఇద్దరు మిత్రులు సిన్మాలో ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో…., ఒహా ఒహో నిన్నే కోరెగా కుహు కుహు అనీ కోయిలా..,, గీతాల్లో చక్కని భావాలు పలికించింది.
ఎన్.టి.ఆర్. సరసన సారంగధరలో అన్నావా భామినీ ఏమనీ అన్నావా మోహనా ఎప్పుడైనా అన్నావా మోహనా… బభ్రుహహనలో ఉలూచిగా తన తపన వ్యక్తం చేస్తూ ఏలరా మనోహరా త్రిలోక మోహనా…., మనసేమో ఒయారాలా విలాసాలా మహారాజా…., మంచి మనసుకు మంచి రోజులోలో కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏ నాటికైనా మారేనా… ,ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా, కనిపెంచే తల్లికి…, వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా… గీతాల్లో ఎన్.టి.రామారావు చెల్లెలిగా రావే నా చెలియా రావే నా చెలియా నా జీవన మాధురి నీవే…. గీతంలో రమణమూర్తి ముందు చక్కని నటన చూపింది.
రాజమకుటంలో పల్లెటూరి యువతిగా ఎడ్లబండి తోలుతూ హేయ్ ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు…. పాటలోనూ, గాలికి, వెన్నెలకు షరతులు విధిస్తూ సడిసేయకో గాలి సడి సేయబోకే కడలి ఒడిలో నా రాజు పవళించేనే… గీతంలో ఎన్.టి.ఆర్ ప్రేయసిగా హావభావ విలాసాలతో రక్తి కట్టించారు. ఆడపెత్తనం చిత్రంలో రేలంగితో ప్రియుడా బిరాన సరసకు రావేలా చలాకి సొగసులు నీవేరా… తోడికోడళ్లు చిత్రంలో రేలంగి నీ సోకు చూడకుండ నవనీతమ్మా నే నిముసమైన బతకలేను ముద్దులగుమ్మ…, అని పాడితే ఎంత మాయగాడివిరా రమణయ్య మావా నిను ఏ తల్లి కన్నదిరా వయ్యారి బావా…. అని ఆటపట్టిస్తుంది. ఖైదీ కన్నయ్యలో ఈ నిజం తెలుసుకో …. తెలివిగా నడుచుకో.. అనే గీతంలోనూ, ఇదే మరోసారి విషాదగీతంగా వచ్చినప్పుడు తీయతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ… గీతంలోనూ చిట్టితమ్ముడులో రాజనాలతో ఏస్కో నా రాజా అహ్ ఏస్కో… పాటలోనూ వీధి నృత్యంగా మాయాబజార్‌లో నా సామిరంగా…. పాటలో అల్లావుద్దీన్ అద్భుత దీపంలో సితారగా వచ్చాను నీ కోసమే వగలు తెచ్చాను నీకోసమే…. గీతంలో చక్కని ప్రతిభ చూపారు.
రాజనర్తకిగా జయభేరిలో జావళిగీతం నీవెంత నెరజాణ ఔరా…. లోను మహాకవి కాళిదాసులో రాజనర్తకిగా చేసిన నాట్యంలో, వెలుగు నీడలు చిత్రంలో అక్కినేనితో కలిసి పాడిన ప్రబోధగీతం పాడవోయి భారతీయుడా…. మోసగాళ్లకు మోసగాడులోని క్లబ్ సాంగ్‌లో గీతానికి తగ్గరీతులు చూపింది నటనలో నాట్యంలో . సువర్ణ సుందరిలో జయంతిగా, కాళహస్తి మహత్మ్యంలో చింతామణిగా పెళ్లినాటి ప్రమాణాలులో టైపిస్ట్ రాధారాణిగా, తాతమనవడులో గీతగా కరుణామయుడులో హిరోదియా పాత్రలో, చిన్నకోడలులో ప్రభాకరరెడ్డి భార్యగా తోడికోడళ్లులో జయసుధ, మాలశ్రీల తల్లిగా, వరపుత్రుడు, ఆడపులి చిత్రాలలో వేశ్యమాతగా, కొన్ని చిత్రాలలో విలన్ తరహా పాత్రలలో ప్రతిభా సామర్థాలను ప్రదర్శించారు.
ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు రాజసులోచన గాఢంగా ప్రేమించుకున్నారు. సి.ఎస్.రావుకి తొలుత నటి, నిర్మాత కన్నాంబ కుమార్తెతో పెళ్లైంది. ఆమె మరణించిన కొంత కాలం తర్వాత ఏర్పడిన ప్రేమ బంధం వివాహ బంధం అయింది. వీరికి దేవి, శ్రీదేవి జన్మించారు. ఇద్దరూ నాట్య ప్రవీణులే. కవల పిల్లలు. దేవికి చెన్నైలో డ్యాన్సర్‌గా మంచి పేరుంది. శ్రీదేవి ఆమె కుమారుడు అమెరికాలో వుంటారు. రాజసులోచనకు వాస్తు శాస్త్రంలో కూడా మంచి ప్రవేశం వుంది. చెన్నైలోని మాడపాక్కంలో తను స్వంతంగా ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకుని పెద్ద బంగ్లా నిర్మించుకున్నారు. నాట్యశిక్షణ ఇస్తూనే జీవిత చరమాంకంలో 2013 మార్చి 5న శ్వాస కోశ సమస్యలతో మృతిచెందారు.

Virus-free. www.avast.com

Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s