My article about జయసుధ 22-5 -1016న హరివిల్ లు (మన తెలం గాణా

On Sunday, May 29, 2016 7:16 PM, kesavarao vadduri <kesavaraovadduri@yahoo.com> wrote:

అభినయ సూచి జయసుధ

Jayasudhaఅందం అభినయం కలబోసి అప్పట్లో అందాల అగ్రనాయికగా, తర్వాత అందమైన ఆంటీగా, ఈ మధ్య మమత, అనురాగం పండించే సిసలైన సుందర మాతృమూర్తిగా నడివయసు దాటిన వారి ఇల్లాలుగా కొనసాగుతుండటం జయసుధలోని ప్రత్యేకత. సంభాషణకి, సందర్భాన్ని బట్టి ప్రేమ, అనురాగాలు, కోపం, ఆసూయ, అహంకారం, ఆభిజాత్యం వినబడేలా ఉచ్ఛరించడం, అభినయంతో సన్నివేశ ప్రాధాన్యతననుసరించి నవరసాలు మోములో పరికించడం, శరీర కదలికల్లో చూపడం ఆమె ప్రజ్ఞాపాటవాలు వివరిస్తాయి.
ముగ్గురు దర్శకుల వద్ద అలుపు, సొలుపు లేకుండా చెప్పింది. అర్థం చేసుకుని క్షణక్షణానికి పరిపక్వత సాధించడం వల్లనే నాలుగు దశాబ్దాలపై నుంచి వెండి తెరపై వెలుగులు చిమ్ముతూ అభిమానుల హృదయాలను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్నదామె. బాలచందర్ నుంచి నటన నేర్చుకుని, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావుల నేతృత్వంలో అజంతా సుందరిగా, అభినయ సూచిగా, తేలి సానబట్టిన వజ్రం అయ్యారీమె. జయసుధ పేరుతోనే ఒక చిత్రం దర్శకుడు దాసరి నారాయణ రావు రూపొందించారంటే ‘జ్యోతి’ పేరుతో రాఘవేంద్రరావు, అద్భుత చిత్రం తీయగలిగారంటే ఆమెలోని ప్రతిభను వారు గుర్తించడమే కారణం.
1973లో బాలచందర్ ‘అరంగేట్రం’ తమిళ చిత్రం నుంచి ‘ఆంటీ’ తెలుగు చిత్రం వచ్చే వరకు అందాలను ఆరబోసి నాయికగా, ప్రణయ సన్నివేశాల్లో అలరించే ముగ్ధగా, విషాద సన్నివేశాల్లో సానుభూతి పొందే మూర్తిగా, ప్రేమానురాగాలు పంచే సన్నివేశాల్లో అనురాగమూర్తిగా కనిపించి యువతరానికి, నడి వయసు దాటిన వారిని స్వప్న నాయికగా అలరించారు జయసుధ. తర్వాత అందాల ‘ఆంటీ’ గా కుర్రకారు గుండెల్లో లయ పెరిగేలా చేశారు. ఇప్పుడు అందమైన అమ్మగా రాణిస్తున్నారు. అయితే ఆమెకు ఆమెలోని ప్రతిభను పూర్తిగా వెలువరించే పోటీ ఇంకా దక్కలేదనే అనిపిస్తుంది.
త్రిమూర్తుల సాన బట్టిన వజ్రం
తెలుగులో ఎన్.గోపాలకృష్ణ (లక్ష్మణరేఖ గోపాల కృష్ణ) దర్శకత్వంలో వెలువడిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’ ఆమెకు తొలి చిత్రమే 1975లో గుర్తింపు తెచ్చేలా చేసింది. ఈ సినిమాకు నాయికగా మిమ్మల్ని ఎంపిక చేయకపోయారా అని అప్పట్లో గోపాలకృష్ణను ఆనాటి కథా నాయికలు అడిగేవారు, దెబ్బపొడిచేవారు. ఒక మాదిరి పాత్రలు సినిమాల్లో పోషించిన తల్లి జోగాభాయి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని త్రిమూర్తులు (బాలచందర్, రాఘవేంద్రరావు, దాసరి) నేతృత్వంలో ఎదుగుతూ పరాకాష్ట దశకు నటిగా చేరుకున్నారు జయసుధ. పండంటి కాపురం (1972)లో పన్నెండేళ్ల అమ్మాయిగ జమున కూతురుగా నటించి బాలచందర్ ‘అరంగేట్రం’ 1973 విడుదల కావటంతో నాయికగా మారారు. ఈమె అసలు పేరు సుజాత. అయితే సుజాత అనే పేరుతో ఒక హీరోయిన్ చక్కని ప్రతిభ కనబరుస్తూ మెరుస్తుంటే జయసుధగా ప్రవేశించి ఆనాటి జయత్రం (జయప్రద, జయసుధ, జయచిత్ర)తో పోటాపోటీగా కొనసాగారు. ఎన్.టి.ఆర్ అక్కినేని, కమల్‌హాసన్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి వారి సరసన నటించి అందరి అభిమానుల ఆదరణ పొందగలుగుతున్నారు.
‘సోగ్గాడు, జ్యోతి, ప్రేమ లేఖలు, మల్లెపువ్వు, అమర దీపం, అడవి రాముడు, ఆమె కథ, శివరంజని, కల్యాణి, ఇంటింటి రామాయణం, డ్రైవర్ రాముడు, గోపాలరావు గారి అమ్మాయి, ప్రేమాభిషేకం, ఇల్లాలు, మేఘసందేశం, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, భార్యమణి, తాండ్ర పాపారాయుడు, కాంచన సీత, కలికాలం, ఒంటరిపోరాటం, గృహ ప్రవేశం, ధర్మాత్ముడు, కుంకుమ తిలకం, నా మొగుడు నాకే సొంతం, మగధీరుడు, ఇలా ఎన్నో చిత్రాలు నాయికగా ఆమె నట వైదుష్యాన్ని చూపి సావిత్రికి వారసురాలిననిపించారు నటనలో క్రమక్రమంగా జయసుధ.
జైలర్‌గారి అబ్బాయి, బావ బావమరిది, మనీ, మనీ-మనీ, ఆంటీ, హేండ్సప్, అక్కపెత్తనం – చెల్లిలి కాపురం తదితర చిత్రాలు రెండవ దశలో ఆమె నటనకు మరిన్ని మెరపులద్దాయి. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, స్టైల్, బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలు కెరీర్‌లో మరో గుర్తింపు తెచ్చాయి. అందుకే ఆమె ప్రేక్షక “జనసుధ, అభిమాన సుధ, అందాల సుధ అనిపించుకుంటున్నారు.

‘జ్యోతి, ఆమె కథ, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ధర్మాత్ముడు చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులు లభించిన జయసుధ నటనను ‘శివరంజని’ చిత్రంలో నటిస్తున్నప్పుడే దాసరి నారాయణ రావు ఆమెకు ‘సహజ నటి’ అని బిరుదునిచ్చారు. అది ఒక అవార్డుగా కాపాడుకుంటూ వస్తున్నందున జయసుధ ఈ పాత్ర బాగా చేయలేదు అనే మాట ఇప్పటి వరకు అనిపించుకోలేకపోయారు’.

“సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరుగాలి తరగల్లె మెలమెల్లగా, సెలయేటి నురగల్లె తెలతెల్లగా’ (జ్యోతి చిత్ర) పాటలో చక్కని నవ్వులు చిందిస్తుంది. సరిగమలు తగ్గట్టుగా ‘సుజాతా ఐ లవ్ యు సుజాత, నిజంగా ఐ లవ్ యూ సుజాత’ (గోపాల రావు గారి అమ్మాయి) ‘నీ చూపులోన విరజాజి వాన ఆ వాన లేక నేను తడిసేనా హాయిగా, నీ నవ్వులేక రతనాల వాన ఆ వానలేక నేను తడిచేనా తీయగా’ (పిల్ల జమీందార్) ‘దప్పి కుండదు, పక్క కుదరదు, నిదుర పట్టదు, ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు’ పాటలో ‘గేరు మార్చు స్పీడు పెంచు చకచక పోనీ కారు’ పాటలో, గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్, మనసార నీతో మాటాడుకోనీ (శివమెత్తిన సత్యం) గోరంత ఆమె ప్రణయ భంగిమలు, రెచ్చగొట్టే విధానం కనిపిస్తాయి. ‘రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా’ (త్రిశూలం) పాటలో ఆర్తి, ఆరాధన, అభిమానం ఆమె భావాల్లో వ్యక్తం అవుతాయి. ఇలా ఎన్నో పాటలో ఆమె వైదుష్యాన్ని గుర్తు చేస్తాయి.
ఎంత పెద్ద డైలాగులైనా (పేజీల కొద్దీ ఉన్నా) ఒకసారి, రెండుసార్లు కళ్ళు మూసుకుని వినేసి ఒక టేక్‌లో డబ్బింగ్ చెప్పే సామర్థం జయసుధకు వుంది. హీరోయిన్‌గా వుండే దశలో కొన్నాళ్ళు బొద్దుగా, కొన్నాళ్ళు బక్కగా కనిపిస్తుంటే ‘ఏమిటి ఈ మార్పు’ అని అడిగితే “పాత్రను బట్టి తనువును మారుస్తున్నా” అని లౌక్యం ప్రదర్శించక. “నా ఆరోగ్యం అంత మంచిది కాదండీ” అని స్పష్టంగా చెప్పేవారామె. జయసుధకు క్రికెట్ అంటే ఇష్టం. ఒకసారి తన అభిమాన క్రికెటర్ ఔట్ అయితే షాట్ బ్రేక్ లో బాధపడుతున్న జయసుధను చూసి “ఎవరో ఔటయితే మీకే మయింది” అని ఎన్టీర్ ప్రశ్నిస్తే కంగు తిన్నారు. విజ్ఞానగని నిడదవోలు వెంకటరావు మనవరాలిగా బ్రాహ్మణ మూలాలున్న జయసుధకు కమ్మవారితో అనుబంధం ఉంది. క్రిస్టియన్ మతం మీద అభిమానం. క్రీస్తు సేవకు తన ప్రతి సినిమా పారితోషకం నుంచి వేలకు వేలు కేటాయిస్తారు. భర్త నితిన్ కపూర్‌తో కలిసి జె.ఎస్.కె.కంబైన్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘కాంచన సీత, కలికాలం, మేరాపతి సిరఫ్ మేరా హై, అదృష్టం, వింత కడళ్లు, హేండ్సప్ చిత్రాలు నిర్మించారు. వీటిలో కొన్ని చిత్రాలు చక్కని చిత్రాలైనా ఆర్థిక పరిపుష్టి ఏర్పడక చిత్ర నిర్మాణానికి దూరమయ్యారు. చీరలకు డిజైనింగ్ చేస్తూ ఏడాదికి ఒకసారి ఎగ్జిబిషన్ కూడా నిర్వహించి ఆ ఆదాయంలో కొంత సేవలకు కేటాయిస్తారు.
‘జ్యోతి, ఆమె కథ, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ధర్మాత్ముడు చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డులు లభించిన జయసుధ నటనను ‘శివరంజని’ చిత్రంలో నటిస్తున్నప్పుడే దాసరి నారాయణ రావు ఆమెకు ‘సహజ నటి’ అని బిరుదునిచ్చారు. అది ఒక అవార్డుగా కాపాడుకుంటూ వస్తున్నందున జయసుధ ఈ పాత్ర బాగా చేయలేదు అనే మాట ఇప్పటి వరకు అనిపించుకోలేకపోయారు.
– వి.ఎస్. కేశవరావు

Virus-free. www.avast.com
Advertisements

About vskesavarao

I am a Telugu Journalist. I started career as a Journalist 1976 in Andhrapatrika Daily. I am one of the founder member in the Editorial Board of Andhra Bhoomi Illustrated Weekly after February 1977.Latter I worked in Venditera Film weekly. I joined in Chitrabhoomi Film Weekly during 1980 of Kakatiya Publications, Hyderabad. It's Publisher is Mr.D.Bheem Reddy. We brought Aadivaram a Socio Political weekly &and Mayuri Illustrated weekly from this Organisation. I worked for this organisation in Hyderabad &and Madras upto 1983. Later I Joined in EENADU daily and worked until April 1984. Then joined again in Chitrabhoomi. Afterwards ie., during 1986 I joined in Andhraprabha daily in Hyderabad. Madras edition started after a long time and I was sent to Madras., Hyderabad as my headquarters.I worked for Vijayachitra a Film Monthly & Film Tradeguide weekly in Madras until1994.Afterwards I came to Hyderabad and joined in Andhraprabha telugu Daily. Now I am Editor in Charge for Chitraprabha a Thursday Film suppliment of Andhraprabha Daily from 2007.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s