Forwarded by [3/12, 07:41] Journa Kuchibatla Srilakshmi: భరద్వాజ మహర్షి నీకు వందనం 🙏🙏🌹🌹
* జ్ఞానపీఠం ”
అధిరోహించిన రావూరి భరద్వాజ “!!
పాత పుస్తకాలు తిరగేస్తుంటే ‘ రావూరి భర
ద్వాజ ‘ గారు గుర్తొచ్చారు.భరద్వాజ గారి
గురించి ఏం చెప్పాలి.ఆయన ..”జ్ఞాన పీఠ ”
పురస్కారాన్ని అందుకున్న ఓ సామాన్యుడు,
నిరాడంబరుడు, సాహితీ వేత్త…!?
మన లోకం తీరేమంటే…మన కళ్ళముందే వుంటున్నా,రోజూ మనతో తిరుగుతున్నా,
మాట్లాడుతున్నా…ఆ వ్యక్తిలోని గొప్పతనా
న్ని మనం గుర్తించం. అది అదే వ్యక్తికి ఏదో
ఒక ‘గొప్ప పురస్కారం ‘ వచ్చిందనుకోండి …ఇక ఆ మనిషికి బ్రహ్మ రథం పడతాం.! ‘ఇంతోడు..అంతోడు ‘ అంటూ ఉన్నవీ,లేనివీ కలిపి ఆకాశానికిఎత్తేస్తాం.
రావూరి భరద్వాజ గారిది కూడా సరిగ్గా …ఇలాంటి పరిస్థితే. రచయితగా నవలలు,
కథలు రాసినప్పుడు ఆయన్ను అంతగా పట్టించుకోని జనం ..జ్ఞానపీఠ ‘ పురస్కార
ప్రకటన రాగానే ఆయనింటికి ‘ క్యూ ‘కట్టా
రు..ఇది నా స్వానుభవంతో చెబుతున్న విషయం. నేనే ప్రత్యక్షసాక్షి. (ఓ పత్రిక కోసం
అప్పుడు నేను కూడా భరద్వాజ గారి
ఇంటికెళ్ళి ఇంటర్యూ చేశాను)
భరద్వాజగారితో నాకు సాహిత్య బంధం కంటే,వ్యక్తిగత బంధమే ఎక్కువ.నేను ఈనాడులో వున్నప్పుడు వాళ్ళబ్బాయి రావూరి కోటేశ్వర రావు ఫొటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. న్యూస్ కవరేజ్ కు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం.అలా కోటేశ్వరరావు నాకు కొలీగ్ గానే కాదు, మంచి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైనా భరద్వాజ గారు కొడుకు ను చూడ
టానికి ఈనాడుకు వచ్చేవారు.అప్పుడు పెద్దా
యనతోమాటామంతీ జరిగేది.అలా భరద్వాజ
గారితో నాకు పరిచయం కలిగింది.సాన్నిహి
త్యం ఏర్పడింది.
భరద్వాజ గారు అంతోడు,ఇంతోడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన జ్ఞాన
పీఠి,జగమెరిగిన సాహితీవేత్త.భరద్వాజగారి బయోడేటా.,ఆయన రాసిన పుస్తకాల వివరా
ల్ని నేనిక్కడప్రస్తావించడం లేదు. చలం గారితో భరద్వాజ గారికి వున్న సంబంధ బాంధవ్యం గురించి మాత్రమేఇక్కడ చెబుతున్నాను.(ఈ వ్యాస పరిథి అంతవరకే )
గుడిపాటి వెంకట చలం గారి రచనలంటే భరద్వాజ గారికి ఎంతో ఇష్టం.నూనూగు మీసాల నూత్నయవ్వనంలో చలం ప్రభావం
తో భరద్వాజ గారు పుంఖానుపుంఖాలుగా బూతు రచనలు చేశారు .చలం గారితో పరిచయం పెంచుకున్నారు.తొందరగానే వారిద్దరి మధ్య సాహితీ బంధం బలపడింది.
భరద్వాజ గారు రాసిన తొలి పుస్తకం..
“రాగిణి “ (1950) కి చలం గారు ముందు
మాట రాశారు.(అచ్చయిన ఆయన తొలి కథ మాత్రం “ విమల “(1946ఆగస్టు,ప్రజామిత్ర ).
*చలం గారి కథను తిప్పి పంపిన భరద్వాజ !!
భరద్వాజ గారు తెనాలిలో ఓ పత్రికలోపని
చేస్తున్నప్పుడు ‘మన భరద్వాజ వున్నాడు కదా ‘ అని చలం గారు ఓ కథను ప్రచురణ
కోసం పంపారు.అయితే చలం కథను తిప్పి పంపాడు. చలంగారి కథలో వైవిధ్యంలేక
పోవడమే అందుకుకారణం. తన కథను
ప్రచురించకుండా తిప్పి పంపినందుకు చలం
గారు ఏమాత్రంకోపగించుకోలేదట.అప్పట్లో భరద్వాజ గారు రచనల్లో బూతుల్ని గుప్పిం
చినా, “బాగుందయ్యా భరద్వాజ “అంటూ
చలం గారు మెచ్చుకునేవారట.
భరద్వాజ గారు చలం సాహిత్యాన్ని విస్తృతం
గా చదివారు దాంతో చలం భావాలు,ఐడియా
లజీ ఆయనకు బాగానే ఒంటబట్టాయి.ఓ దశ
లో చలం శైలిని అచ్చుగుద్దినట్లు అనుకరించా
రు.. భరద్వాజదీనివల్ల చలం గారి రచనలకు, భరద్వాజ రచనలకు మధ్య భేదం కనుక్కోవ
డం కూడా కష్టమయ్యేదట.అయితే ఆతర్వాత భరద్వాజ గారు క్రమంగా చలం ప్రభావం నుండి బయటపడ్డారు అది వేరేసంగతి.
*చలంగారిని విభేదించిన
భరద్వాజ !!
ఓ రకంగా చలంగారితో భరద్వాజ గారు ‘డిఫర్ ‘అయ్యారనే చెప్పొచ్చు.దీనికి ప్రధాన కారణం
‘వేశ్యావృత్తిలో “ స్వేఛ్ఛ”ను గురించి చలంగారు వర్ణించిన తీరుకు,లోకంలోని వాస్తవిక పరిస్థికి మధ్య ఎంతో అంతరాయంవుందని భరద్వాజ గుర్తించారు.చలం గారి మాటలకు,లోకంలోని పోకడలకు మధ్య ఏమాత్రం సామీప్యత లేద
న్నది భరద్వాజగారి అబ్జర్వేషన్.బహుశా అప్ప
టి నుండే చలంగారి భావజాలంతో ఎడంగా… జరిగారుభరద్వాజ.సెక్స్,బూతు వంటి భ్రమలు
బలహీనతల నుండి బయట పడి భరద్వాజ
సామాజిక స్పృహనుఅలవర్చుకొని రచనలు చేశాడు.
ఆయన రాసిన “పాకుడు రాళ్ళు” (1965) నవలకు దేశంలో అత్యున్నత ‘జ్ఞానపీఠం’
పురస్కారం (2012 ) లభించింది.సినీ రంగం
లోని స్త్రీల కష్టాల్ని వున్నదున్నట్లుగా వర్ణించిన నవల ఇది.వాస్తవానికి చాలా దగ్గరగా రాశారు.
భరద్వాజ.(,1965లో కృష్ణాపత్రికలో ధారా
వాహికంగా వచ్చింది ) ‘జీవనసమరం ‘పేరుతో
ఈనాడు దిన పత్రికలో భరద్వాజ గారు రాసిన సామాన్యుల బతుకులకు విశేషాదరణ లభిం
చింది.“దైవరాజకీయాలు “కథకు స్వర్ణకంకణం”
లభించింది.1968,1983 సంవత్సరాల్లో సాహి
త్య అకాడమీఅవార్డులుదక్కాయి.1987లో సోవియట్ ల్యాండ్ నెహ్రు అవార్డ్ ను అందు
కున్నారు.మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సమ్మానించాయి.నాలుగు విశ్వ
విద్యాలయాల్లో పిహెచ్ డి స్థాయిపరిశోథనలు
జరిగాయి.వీరి రచనలుఇంగ్లీషు,హిందీ,తమిళ,
మలయాళ తదితర భాషల్లోకి అనువాద
మయ్యాయి.
పొట్టకూటికోసం ,వ్వసాయ కూలీగా,పశువుల కాపరిగా,రంపం లాగే పనివాడిగా,తిత్తులూదే కూలీగా,పేపర్ బాయ్ గా,చిన్న పత్రికల్లో ఉప
సంపాదకుడిగా పనిచేశారు.దుర్భర దారిద్ర్యం
అనుభవించారు.ఓ సందర్భంలో ఆయన కు
కళ్ళజోడు కొనుక్కునే స్తోమత లేకపోతే,తెనా
లిలో కనకం అనే ఓ వేశ్య ఆరోజుల్లో రూపాయి
న్నర పెట్టి ఓ ఖళ్ళజోడు కొనిచ్చింది.ఇలా పేద
రికం వెంటాడినా ‘జీవన సమరం’లో ఆయన
నెగ్గారు.ఆయన జీవిత పాఠశాలలో నేర్చుకున్న
అనుభవ సారాన్నితన రచనల్లోరంగరించా
రు..కాబట్టే “ జ్ఞానపీఠ “ పురస్కారానికి అర్హులయ్యారు.!
17నవలలు,47కథలు బాలలకు,,11సాహిత్య గ్రంథాలు,33,సైన్స్ కథలు రాశారు.భార్య మర
ణానంతరం రాసిన ఎలిజీ “నాలోని నువ్వు “ఇంకా చిన్న కథలు అవీ ఇవీ అన్నీకలుపు
కుంటే సాహిత్య సాగరమే అవుతుంది..!
భరద్వాజ ఏం రాసినా (చలం ప్రభావం
నుంచి బయట పడ్డాక ) సామాజిక స్పృహ
తోనే రాశారు.సమాజంలోని కష్టాలను,బాధ
ల్నిఅక్షరీకరించారు.ఒకవేళ చలం భావజాలం
రచనల సారం నుండి బయట పడకుండా
వున్నట్లయితే “బూతుల భరద్వాజ”గానే మిగిలిపోయేవారేమో? ఇలా జ్ఞానపీఠాన్ని అధిరోహించే ఛాన్స్ కూడా మిస్సయ్యేదేమో? ఏమో? ఎవరు చెప్పొచ్చారు.?
కేవలం బూతే …కాదండోయ్..”.నాణేనికి రెండో పక్కలా “ తన రచనలకు సామాజిక స్పృహ
కూడా వుందని భరద్వాజ గారురుజువు చేశా
రు.చలం గారి ‘ మత్తు ‘ ఒదిలేదాకా భరద్వాజ
“బూతు “ రచయితగానే వున్నారు.నిజానికి చలం ప్రభావంలోనుంచి బయటకు రాకుండా
వున్నట్లయితే,భరద్వాజ గారు బూతు రచ
యితగానే మిగిలిపోయేవారేమో?!!
[3/12, 08:59] Kesava Rao: 👏👏🙏🙏 నా 12వ యేట పాకుడురాళ్ళు చదివాను. భరద్వాజ గారితో అంతకు ముందు పరిచయం లేకపోయినా నన్ను జర్నలిస్ట్ గా 1980లో చూసి నాకు ఆకాశవాణిలో చదవడం తెలియదన్నా ఓ పుస్తకం ఇచ్చి అది చదివి ఆ కథలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చదివింపజేసారు. గడ్డంతో భీష్ముడు వలె కనిపించేవారు. ఆప్యాయంగాపలకరించే వారు 🙏